‘నేల టిక్కెట్టు’ చిత్రం తరువాత మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ యు ఎస్ లో శరవేగంగా జరుగుతుంది. దాదాపు 40 రోజుల పాటు జరుగనున్న ఈ భారీ షెడ్యూల్ లో సినిమాకు కీలకం కానున్న సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తో ప్రముఖ హీరోయిన్ ఇలియానా మళ్ళి తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంటే ప్రముఖ హాస్య నటుడు కమ్ హీరో సునీల్ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
గత కొంత కాలంగా పరాజయాలతో సతమవుతున్న దర్శకుడు శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రేక్షకులముందుకు రానుంది. అయితే అక్టోబర్ 11న ఎన్టీఆర్ నటిస్తున్న’అరవింద సమేత’ చిత్రం కూడా విడుదలకానుంది. బాక్సాఫిస్ బరి లో నిలుస్తున్న ఈ రెండు చిత్రాల మధ్య ఆసక్తికర పోరు జరగడం ఖాయం గా కనిపిస్తుంది.


