రొటీన్ సినిమాలతో కెరీర్ లో వరుస పరాజయాలను ఖాతాలో వేసుకున్న దర్శకుడు శ్రీను వైట్ల, మాస్ మహారాజ్ రవితేజ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ యు ఎస్ లో జరుగుతుంది. ఇక ఇటీవల ప్రీ లుక్ పోస్టర్ తోనే ఈసినిమా రొటీన్ కు భిన్నంగా ఉండబోతుందని చెప్పిన శ్రీను వైట్ల ఈ సారి ఫస్ట్ లుక్ పోస్టర్ తో దాన్ని నిజం చేశాడు.
రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈచిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను కొద్దీ సేపటిక్రితం విడుదల చేశారు. ఇక ఫస్ట్ లుక్ చూస్తే మూడు గెటప్స్ లో రవితేజ లుక్ ఆకట్టుకుంది. ఎలాగైనా ఈ ఇద్దరు ఈసారి భారీ విజయం సాధించాలని పక్క ప్లాన్ తో వస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం అక్టోబర్ 5న ప్రేక్షకులముందుకు రానుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో ఇలియానా కథానాయికగా నటిస్తుంది. చాలా రోజుల తరువాత ఆమె ఈ చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది.


