సమీక్ష : అమావాస్య – విసిగించిన హార్రర్ డ్రామా

సమీక్ష : అమావాస్య – విసిగించిన హార్రర్ డ్రామా

Published on Feb 9, 2019 2:18 AM IST
Idi Naa Love Story movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 08, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

నటీనటులు : సచిన్ జోషి , నర్గిస్ ఫఖ్రి , మోనా సింగ్

దర్శకత్వం : భూషణ్ పటేల్

నిర్మాత : రైనా జోషి

సంగీతం : సంజీవ్ -దర్శన్

సినిమాటోగ్రఫర్ : అమర్జీత్ సింగ్

ఎడిటర్ : దేవన్ మురుదేశ్వర్

భూషణ్ పటేల్ దర్శకత్వంలో సచిన్ జోషి , నర్గిస్ ఫక్రి జంటగా నటించిన తాజా చిత్రం ‘అమావాస్య’. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చింది . మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :

కరణ్ (సచిన్ జోషి) అహానా(నర్గిస్ ఫఖ్రి) పెళ్లి చేసుకొని ఇద్దరు కలిసి వొకేషన్ కి సిటీ కి దూరంగా వున్నా కరణ్ పురాతన భవనానికి వెళతారు. అక్కడి వెళ్లిన తరువాత వారు ఊహించని పరిమాణామాలను ఎదుర్కుంటారు. అయితే అహనా తన బాయ్ ఫ్రెండే దీనికి కారణం అని బావిస్తుంది. కాని ఈ క్రమంలో మాయ అనే అమ్మాయి ఆత్మ ఈ సమ్యసలకు కారణం అని తెలుసుకుంటుంది. ఇంతకీ మాయ ఎవరు? ఆమె కు కరణ్ కు ఏమైనా సంభందం ఉందా ? అనే విషయాలు తెలియాలంటే ఈసినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సచిన్ జోషి లుక్స్ పరంగా ఒకే అనిపించుకుని తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకున్నాడు. అలాగే నటన పరంగా కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. ఇక మాయ పాత్రలో నటించిన అమ్మాయి చాలా బాగా చేసింది.

మెడికల్ కన్సెల్టెంట్ పాత్రలో మోనా సింగ్ కూడా పర్వాలేదనిపించింది. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సస్పెన్స్ సన్నివేశాలు థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాకి మేజర్ మైనస్ పాయింట్ అంటే స్టోరీ లైన్. ఇలాంటి స్టోరీలతో ఇప్పిటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే దాన్ని ఇంటెన్సివ్ గా డీల్ చేసి కొన్ని చిత్రాలు విజయం సాధించాయి. కానీ ఈచిత్రం మాత్రంఆ విషయంలో ఫెయిల్ అయ్యింది. ఎక్కడ ఉత్కంఠకు గురి చేయని సన్నివేశాలతో సినిమాని బోరింగ్ గా మార్చేశాడు దర్శకుడు.

ముఖ్యంగా చివరి 20 నిమిషాలు వెంట వెంటనే వచ్చే ట్విస్ట్లు ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. సెకండ్ హాఫ్ ను డీల్ చేసిన విధానం కూడా బాలేదు.

సాంకేతిక విభాగం :

డైరెక్టర్ భూషణ్ పటేల్ ఒక హారర్ చిత్రాన్ని తెర మీదకు తీసుకురావడం లో పూర్తిగా తడబడ్డాడు. గ్రిప్పింగ్ గా లేని సన్నివేశాలు ఇంట్రస్టింగ్ గా లేని స్క్రీన్ ప్లే తో సినిమా ఫలితం దెబ్బతింది.

ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా డార్క్ విజువల్స్ ను బాగా చిత్రీకరించాడు. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. సంగీతం విషయానికి వస్తే రెండు పాటలు అలాగే నేపథ్య సంగీతం బాగుంది. సచిన్ జోషి హోమ్ బ్యానేర్ నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

తీర్పు :

సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన అమావాస్య ప్రేక్షకులను థ్రిల్ చేయలేకపోయింది. కొన్ని హార్రర్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమి లేదు. చివరగా ఈ చిత్రానికి దూరంగా ఉండడమే మంచింది.

123telugu.com Rating : 1.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు