
ఈ ఏడాది ఊహించని విధంగా మారిన పరిస్థితుల మూలాన డిజిటల్ రంగంపై ఎంతలా ప్లస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఒకపక్క వాటికి వీక్షణలు పెరడగడమే కాకుండా థియేటర్స్ మూత పడడంతో కొత్త సినిమాలను కూడా డైరెక్ట్ గా రిలీజ్ చెయ్యడం మొదలు పెట్టారు. అయితే ఇక్కడే పలు ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి. సినిమా ఫలితం ఎలాగో దాన్ని చూడక ముందు ఎవరికీ తెలీదు. దీనితో ఆటోమేటిక్ గా అంచనాలు నెలకొంటున్నాయి.
కానీ అన్ని స్ట్రీమింగ్ సంస్థలూ తీసుకుంటున్న చిత్రాలు హిట్టయ్యిపోతున్నాయా అంటే లేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన బిగ్గీస్ అన్నీ నిరాశనే మిగిల్చాయి. అంతే కాకుండా ఈ చిత్రాలు అన్ని కేవలం అమెజాన్ ప్రైమ్ వారే సొంతం చేసుకున్నారు. దీనితో వీరి ఎంపికకు బ్యాడ్ టైం నడుస్తుంది. అయితే సినిమా విడుదలయ్యాక మాత్రం టాక్ బ్యాడ్ వస్తుంది కానీ ఈలోపలే నిర్మాతలు సేఫ్ అవుతున్నారు.
పైగా ప్రైమ్ వీడియో వారికి కావాల్సిన అటెన్షన్ అంతా వచ్చేస్తుంది. కానీ తర్వాత సినిమాలు ఆకట్టుకోలేదని అర్ధం అవుతుంది. అయినప్పటికీ వీరు మాత్రం ఇంకా పెద్ద సినిమాల కోసమే ఎదురు చూస్తున్నారట. ఇక ఇప్పుడు ఎలాగో థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఇక ముందు ఇలాంటి చిత్రాల రిలీజ్ కు బ్రేక్ పడుతుందా లేక మళ్ళీ ఇదే రిపీట్ అవుతుందా అన్నది చూడాలి.