టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాపార రంగంలో భాగంగా ఏషియన్ సినిమాస్ పార్ట్నర్షిప్తో ఏఎంబి సినిమాస్ అనే మల్టీప్లెక్స్ థియేటర్ చైన్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లో ఏఎంబి సినిమాస్ మల్టీప్లెక్స్‌కు మంచి క్రేజ్ ఉంది. ఇక ఇప్పుడు తన మల్టీప్లె్క్స్ చైన్‌ను విస్తరిస్తూ ఇతర రాష్ట్రాల్లో కూడా ఏఎంబి సినిమాస్‌ను సిద్ధం చేస్తున్నారు.
ఇందులో భాగంగా కర్ణాటకలోని బెంగళూరు సిటీలో ఏఎంబి సినిమాస్ మల్టీప్లెక్స్ ఓపెనింగ్‌కు సిద్ధంగా ఉంది. దక్షిణ భారతదేశంలోని తొలి డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ అందించననున్న ఈ మల్టీప్లెక్స్ థియేటర్‌ను జనవరి 16న గ్రాండ్ ఓపెనింగ్ చేస్తున్నట్లు మహేష్ తాజాగా ప్రకటించారు.
ఇదంతా సాధ్యం అయ్యేందుకు తన ఏఎంబి టీమ్ ఎంతగానో శ్రమించిందని.. వారి శ్రమకు ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ మహేష్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
