యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అంశాలతో ఆకట్టుకుంటున్న ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ టీజర్

యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అంశాలతో ఆకట్టుకుంటున్న ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ టీజర్

Published on Oct 9, 2023 10:26 PM IST

ambaji

ఇటీవల రైటర్ పద్మభూషణ్ మూవీతో ఆడియన్స్ ని అలరించి మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు యువ నటుడు సుహాస్. అయితే తాజాగా ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ మూవీ యొక్క టీజర్ ని నేడు గ్రాండ్ గా ఈవెంట్ ద్వారా రిలీజ్ చేసారు మేకర్స్. దుశ్యంత్‌ కటికినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శివానీ నగరం హీరోయిన్‌గా నటిస్తోంది.

హెయిర్ సెలూన్ నడుపుతూ మరోవైపు మ్యారేజి బ్యాండు టీంలో కలిసి పనిచేసే హీరో సుహాస్‌ హీరోయిన్ శివానీతో లవ్‌లో పడడం, వారి మధ్య ఫన్నీ లవ్‌ ట్రాక్‌, ఆపైన కొన్ని సీరియస్ యాక్షన్ అంశాల చుట్టూ తిరిగే స్టోరీతో సినిమా ఉండబోతున్నట్టు టీజర్‌ చూస్తే మనకు అర్ధం అవుతుంది. కాగా ఈ టీజర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది అనే చెప్పాలి. ఈ మూవీలో పుష్ప ఫేం జగదీశ్‌ ప్రతాప్‌ బండారి, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ మూవీని గీతా ఆర్ట్స్‌ 2, మహాయణ మోషన్ పిక్చర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలో ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు