
శంకర్, రజనీకాంత్‌ల క్రేజీ కాంబినేషన్లో ప్రభంజనం సృష్టించిన ‘రోబో’కు సీక్వెల్ రూపొందించే పనిలో దర్శకుడు శంకర్ నిమగ్నమైన విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకూ అఫీషియల్‌గా అనౌన్స్ కూడా కాని ఈ సినిమాపై ఇప్పట్నుంచే విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రతీవార్త ట్రెండింగ్‌గా మారిపోయింది. ఈ సినిమాను 3డీలో తెరకెక్కించే ఆలోచన చేయడం, ఓ ప్రముఖ హాలీవుడ్ నటుడిని ఈ సినిమాకు విలన్‌గా ఎంపికచేయడం లాంటి వార్తలతో ఇప్పటికే వార్తల్లో నిలిచిన రోబో 2, తాజాగా మరో కొత్త కథనంతో సందడి చేస్తోంది.
భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో అమీ జాక్సన్‌ను హీరోయిన్గా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అమీ జాక్సన్ ఈ సినిమాలో ఓ సైంటిస్ట్‌గా కనిపిస్తారట. ఇక శంకర్ దర్శకత్వంలో ఇప్పటికే ‘ఐ’ సినిమా చేసిన అమీ, ఆ వెంటనే ‘రోబో 2’కూ సెలెక్ట్ అయినట్లు వార్తలు రావడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. ‘ఐ’ సినిమాలో అమీ జాక్సన్ నటనకు సూపర్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ‘రోబో 2’లోని ఓ పాత్రకు కూడా అమీ జాక్సన్ న్యాయం చేస్తుందని శంకర్ అమీ జాక్సన్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలింకా అఫీషియల్‌గా అనౌన్స్ కావాల్సి ఉంది.

