మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “పెద్ది”. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ సాలిడ్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లో మేకర్స్ కూడా భారీ ప్లానింగ్ లు చేస్తున్నప్పటికీ అభిమానులు మాత్రం ఇంకా డిజప్పాయింట్ గానే ఉన్నారు.
యూఎస్ మార్కెట్ లో భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ అనుకున్న సినిమా బుకింగ్స్ పరంగా ఇప్పుడు స్లో అయ్యింది. దీనితో సమయం దగ్గరకి వస్తున్నప్పటికీ మేకర్స్ ఇంకా ఎలాంటి కంటెంట్ ని వదలకుండా డిలే చేస్తున్నారనే అభిమానులు భావిస్తున్నారు. దీనితో ఏదొక కొత్త కంటెంట్ కనీసం కొత్త పోస్టర్ ని కూడా వదలకుండా కాలయాపన చేస్తుండడంతో అభిమానులు ఒకింత నిరాశ గానే ఉన్నారు.
సో పెద్ది నుంచి కొత్త కంటెంట్ రావడం ఎప్పటి నుంచి మొదలవుతుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా గ్రాండ్ గా జూన్ 4న విడుదల కాబోతుంది.


