‘ఆదర్శకుటుంబం’లో ఫన్నీ ఫ్లాష్ బ్యాక్ ?

‘ఆదర్శకుటుంబం’లో ఫన్నీ ఫ్లాష్ బ్యాక్ ?

Published on May 10, 2026 8:07 AM IST

Adarsha-Kutumbham

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న ‘ఆదర్శకుటుంబం – హౌస్ నెం. 47′ (AK47)’ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఫ్లాష్ బ్యాక్ పై ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వెంకీ ‘రా ఏజెంట్’ లా కనిపిస్తాడు. అయితే, వెంకీ పాత్రకు దృష్టి లోపం ఉంటుందని.. ఈ లోపంతో ఏజెంట్ గా వెంకీ పాత్ర ఎలాంటి ఛేజ్ లు చేశాడనే కోణంలో డ్రామాను ఫుల్ ఎంటర్టైనింగ్ గా త్రివిక్రమ్ డిజైన్ చేశాడని తెలుస్తోంది. అన్నట్టు ‘మీర్జాపూర్’ ఫేమ్ బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ, ఈ సినిమాలో తీవ్రవాదిగా నటించబోతున్నాడు.

అన్నట్టు నాణ్యత విషయంలో త్రివిక్రమ్ ఎక్కడా రాజీ పడటం లేదు. పైగా త్రివిక్రమ్‌ రచయితగా వెంకటేశ్ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ తదితర చిత్రాలు అద్భుత విజయాలు సాధించాయి. అందుకే, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మూవీని ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా నిర్మాణ సంస్థ హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

తాజా వార్తలు