కళ్యాణ్ రామ్ “అమిగోస్” రన్ టైమ్ లాక్డ్!

కళ్యాణ్ రామ్ “అమిగోస్” రన్ టైమ్ లాక్డ్!

Published on Feb 6, 2023 7:20 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అమిగోస్. ఈ చిత్రం లో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ చేస్తున్న చిత్రం కావడం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ను చిత్ర యూనిట్ నిన్న గ్రాండ్ గా చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ ను పొందగా, రన్ టైమ్ ను లాక్ చేసుకుంది. ఈ చిత్రం 139 నిమిషాల నిడివి కలిగి ఉంది. అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు