‘సైరా’కు బాలీవుడ్ సంగీత దర్శకుడు !

‘సైరా’కు బాలీవుడ్ సంగీత దర్శకుడు !

Published on Jul 25, 2018 3:05 PM IST

Music

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి , రవికిషన్, సుధీప్, తమన్నా వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ చిత్రానికి సంభందించిన సంగీత దర్శకుడిని ఎట్టకేలకు ఫైనల్ చేశారు. ముందుగా ఏ ఆర్ రహమేన్ ,కీరవాణి పేర్లు తెర మీదకు వచ్చిన అనివార్య కారణాలతో వాళ్లను తీసుకోలేదు. ఇక ఇప్పుడు ఈ చిత్రం కోసం బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే అయన ఈచిత్రం కోసం ట్యూన్స్ కూడా సిద్ధం చేస్తున్నాడట.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సరసన నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈచిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు