మరోసారి “కల్కి” గురించి అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మరోసారి “కల్కి” గురించి అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Published on Jul 9, 2024 11:00 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఎడి. ఈ చిత్రం ధియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ఇప్పటికే 900 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ది కల్కి క్రోనికల్స్ పేరిట మేకర్స్ కొన్ని వీడియోలను రిలీజ్ చేస్తూ, సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా సెకండ్ ప్రోమో ను విడుదల చేయడం జరిగింది.

ఈ ప్రోమో లో అమితాబ్ బచ్చన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్కి 2898ఎడి అంటే ఏంటి అని అడగగా, అందుకు నాగ్ అశ్విన్ సమాధానం ఇచ్చారు. అంతేకాక హైదరాబాద్ లోని ధియేటర్ లో కల్కి చిత్రాన్ని తెలుగు ఆడియెన్స్ తో చూడటం తనకి ఇష్టం అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియో త్వరలో రిలీజ్ కానుంది. యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు