భారీ మొత్తం లో టాక్స్ చెల్లించిన మెగా స్టార్ !

Published on Apr 14, 2019 11:58 am IST

బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ 2018-2019 కి గాను 70 కోట్ల టాక్స్ ను చెల్లించి బాలీవుడ్ లో హైయెస్ట్ టాక్స్ పెయిర్ గా రికార్డు సృష్టించారు. అంతే కాకుండా అమితాబ్ బీహార్ లోని ముజఫర్ పుర్ లోని 2084 మంది రైతుల లోన్ లను కూడా క్లియర్ చేశారు. ఇక అలాగే పుల్వామా దాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు 10లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసిన మొదటి నటుడు కూడా ఆయనే కావడం విశేషం.

సినిమాల విషయానికి వస్తే అమితాబ్ ఇటీవలే సైరా , బ్రహ్మస్త్ర సినిమాల షూటింగ్ ను పూర్తి చేశారు. ఈ రెండు ఈ ఏడాదిలోనే విడుదలకానున్నాయి. ప్రస్తుతం బిగ్ బి ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :