ప్రభాస్ 20 మ్యూజిక్ డైరెక్టర్ ఆయనైతే కాదు..!

Published on May 22, 2020 8:15 am IST

ప్రభాస్ లేటెస్ట్ రొమాంటిక్ లవ్ పీరియడ్ డ్రామా షూటింగ్ జరుపుకుంటుంది. లాక్ డౌన్ ముందు వరకు డైరెక్టర్ రాధా కృష్ణ నిరవధిక షూటింగ్ జరిపారు. ఈ మూవీ చివరి షెడ్యూల్ జార్జియా దేశంలో చిత్రీకరించడం జరిగింది. కాగా ఈభారీ పాన్ ఇండియా చిత్రానికి మ్యూజిక్ కంపోజర్ ఎవరు అనే విషయంపై క్లారిటీ లేదు. ఐతే గతంలో బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ మరియు నేషనల్ అవార్డు విన్నర్ అమిత్ త్రివేది మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఐతే ఈ వార్తలలో ఎటువంటి నిజం లేదని ఆయన తాజా వ్యాఖ్యలు రుజువు చేశాయి.

తాజా ఇంటర్వ్యూలో అమిత్ తెలుగులో నాని హీరోగా తెరకెక్కిన వి, క్వీన్ రీమేక్ మినహా ఎటువంటి తెలుగు సినిమాకు పని చేయడం లేదని చెప్పారు. దీనితో ప్రభాస్ మూవీకి అమిత్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న విషయంలో నిజం లేదని తేలిపోయింది. ఇక భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుండగా యూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More