వర్మకు బెస్ట్ విషెస్ చెప్పిన మెగాస్టార్.

rgv

రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ సెన్సేషనల్ మరియు కాంట్రవర్సియల్ చిత్రం రేపు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మార్షల్ ఆర్ట్స్ చిత్రం ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ చిత్ర టీజర్ నిన్న విడుదల చేసి మరో సంచలనానికి తెరలేపారు. ఇండో చైనీస్ కొలాబరేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మార్షల్ ఆర్ట్స్ గర్ల్ గా నూతన నటి పూజ భాలేకర్ నటించారు. కాగా ఈ టీజర్ చూసిన మెగాస్టార్ అమితాబ్ వర్మపై ప్రశంసలు కురిపించారు.

అమితాబ్ ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ మూవీ టీజర్ లింక్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేయడంతో పాటు, రాము కి బెస్ట్ విషెస్ అని చెప్పారు. బాలీవుడ్ లో వర్మకు అమితాబ్ చాలా సన్నిహితుడు. 2005లో వీరి కాంబినేషన్ లో వచ్చిన సర్కార్ సూపర్ హిట్ గా నిలిచింది. వీరిద్దరూ సర్కార్ రాజ్, సర్కార్ 3, నిశ్శబ్ద్, ఆగ్, డిపార్ట్మెంట్ ఇలా అరడజనుకు పైగా చిత్రాలు కలిసి చేశారు.

Exit mobile version