విజయ్, మమత, రిషివర్మ, సుహాసన ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం ‘అమృత నిలయం’. రాజా విక్రమ నరేంద్ర దర్శకుడు. ఆర్.పి సమర్పణలో అను ఫిల్మ్ బ్యానర్‌పై రామమోహన్ నాగుల, ఎం.ప్రవీణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది.
దర్శకుడు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత తాగిన మైకంలో వారు చేసే పొరపాట్ల వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అలాంటి కుటుంబాల్లో ఓ అంధుడి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ వైజాగ్‌లో ఎక్కువ శాతం షూటింగ్ చేశాం. సింగిల్ షెడ్యూల్లో సినిమా పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశలో ఉన్నాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తాం అని తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు: రవినాయక్, సంగీతం: రాం, పీఆర్వో: వీఆర్ మధు.


