‘ఫంకీ’లో ఇంట్రెస్టింగ్ కామియో.. అనుదీప్ సాధ్యం చేశాడా?

‘ఫంకీ’లో ఇంట్రెస్టింగ్ కామియో.. అనుదీప్ సాధ్యం చేశాడా?

Published on Feb 8, 2026 10:00 PM IST

Funky

ఈ ఫ్రైడే థియేటర్స్ లో అలరించడానికి వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు అనుదీప్ కె వి తెరకెక్కించిన హిలేరియోస్ ఎంటర్టైనర్ చిత్రం ఫంకీ (Funky) కూడా ఒకటి. ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఆడియెన్స్ కి ఇందులో ఓ ఇంట్రెస్టింగ్ కామియో కూడా ఉందని ఓ టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. మరి ఆ కామియో ఎవరిదో కూడా కాదు ఈ సినిమా నిర్మాత సోషల్ మీడియా నెటిజన్స్ అభిమాన నిర్మాత నాగవంశీ అన్నట్టు వినిపిస్తుంది.

మరి నిజంగానే నాగవంశీ ఈ సినిమాలో ఉన్నారో లేదో అనేది పక్కన పెడితే అనుదీప్ మాత్రం అది సాధ్యం చేసినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. తన సినిమాల్లో ఇలాంటి సర్ప్రైజ్ లు షాక్ లు తను అలా నైస్ గా తళుక్కుమనిపిస్తూ ఉంటాడు. సో అలానే నాగవంశీపై కూడా తన మార్క్ రైటింగ్ తో ఏమన్నా ఫన్ ని జెనరేట్ చేసి ఉండొచ్చు. సో ఈ ఇంట్రెస్టింగ్ కామియో ఉందో లేదో అనేది తెలియాలి అంటే ఈ ఫిబ్రవరి 13 వరకు ఆగాల్సిందే.

తాజా వార్తలు