“ఆచార్య”, “విరాట పర్వం” సినిమాలకు ఊహించని ట్విస్ట్.!

Published on Apr 10, 2021 1:01 pm IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “ఆచార్య”. దీనిపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలిసిందే. అలాగే మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి హీరోగా చేసిన మరో చిత్రం “విరాట పర్వం”. అయితే ఈ రెండు సినిమాలకు కూడా కామన్ గా కలిసిన ఓ పాయింట్ నే చిక్కుగా మారింది. ఈ రెండు చిత్రాలు కూడా నక్సల్ నేపథ్యంలో తెరకెక్కినవే అని తెలిసిందే. ఇప్పుడు ఈ అంశమే సమస్యగా మారింది.

ఇటీవలే ఛత్తీస్ ఘడ్ లో మావోస్ ఎలాంటి ఘాతుకానికి పాల్పడ్డారో తెలిసిందే. మరి ఆ ఘటనను అనుసరించి ఇలాంటి సినిమాల్లో నక్సలైట్స్ ను పాజిటివ్ గా చూపించే ప్రయత్నం చేస్తే తగదని యాంటీ టెర్రరిజం ఫోరమ్స్(ఏ టి ఎఫ్) వారు హైదరాబాద్ లోని సెన్సార్ బోర్డు యాజమాన్యాన్ని కలిసి సూచించారు. ఒకవేళ అలా ఉంటే కనుక ఆ రెండు సినిమాలకు సెన్సార్ చెయ్యకూడదని తెలిపారు. అలాగే మున్ముందు కూడా ఇలాంటి సినిమాలు ప్రోత్సహింహకూడదని తెలిపారు. మరి దీనిపై ఈ రెండు సినిమాలకు ఏం జరగనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :