లేటెస్ట్..”మెగాస్టార్ 156″ నుంచి ఊహించని అప్డేట్ ఇచ్చిన మేకర్స్

లేటెస్ట్..”మెగాస్టార్ 156″ నుంచి ఊహించని అప్డేట్ ఇచ్చిన మేకర్స్

Published on Oct 24, 2023 12:35 PM IST

mega156 1

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు చేయనున్న చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కించనున్న మాసివ్ ఫాంటసీ వండర్ కూడా ఒకటి. మరి ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్ లో 156వ సినిమా గా తెరకెక్కిస్తుండగా నిన్ననే సినిమాపై ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ ని అయితే అందించారు.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం పై ఈరోజు పూజా కార్యక్రమం విషయంలో ఓ వీడియో అప్డేట్ ఇస్తామని చెప్పిన మేకర్స్ ఇప్పుడు ఆ అప్డేట్ అందించారు కానీ దానికి అదనపు ఇన్ఫో కూడా మేకర్స్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.

తాము ఈ చిత్రాన్ని మొదట ఓ సెలెబ్రేషన్ సాంగ్ రీరికార్డింగ్ పనులతో స్టార్ట్ చేశామని అంతే కాకుండా సినిమాలో ప్రస్తుతానికి 6 పాటలు ఉన్నాయని కూడా కన్ఫర్మ్ చేశారు. దీనితో జస్ట్ పూజా కార్యక్రమ వీడియో మాత్రమే వస్తుంది అనుకున్న మెగా ఫ్యాన్స్ కి ఇదో ఊహించని అప్డేట్ అని చెప్పాలి. ఇక ఈ పూజా కార్యక్రమంలో మెగాస్టార్ తన సాలిడ్ ప్రెజెన్స్ తో రాగ తాను కొబ్బరికాయ కొట్టి లెజెండరు దర్శకుడు కె రాఘవేంద్రరావు క్లాప్ తో సినిమాని ఆరంభిచుకున్నారు.

తాజా వార్తలు