అఖిల్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ నుంచి రాబోతున్న అప్డేట్.!

Published on Apr 4, 2021 6:51 pm IST

అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మరో హ్యాండ్సమ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ ఇప్పటి వరకు సరైన విజయాన్ని నమోదు చేసుకోకున్నా తన మలి చిత్రానికి మాత్రం మంచి బిజినెస్ సహా ఓపెనింగ్స్ ను కూడా మినిమస్ రాబట్టగలిగే స్టేటస్ తెచ్చుకోగలిగాడు. మరి ఇప్పుడు అఖిల్ రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే వాటిలో స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డితో ప్లాన్ చేసిన థ్రిల్లర్ కూడా ఒకటి.

మరి ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్న ఏకె ఎంటర్టైన్మెంట్స్ వారు ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ సాలిడ్ కాంబో నుంచి ఈ వారంలో ఓ స్పెషల్ అప్డేట్ ను రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు. అయితే అది పోస్టర్ అయ్యి ఉంటుంది అని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఇది ఏమిటో తెలియాలి అంటే కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఈ ప్రాజెక్ట్ పై మాత్రం మంచి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :