“మేజర్” టీజర్ పై లేటెస్ట్ అప్డేట్.!

Major

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న పలు ఆసక్తికర చిత్రాల్లో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రం “మేజర్” కూడా ఒకటి. పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేసిన ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే గత కొన్ని రోజులు నుంచి మంచి అప్డేట్స్ ఇస్తూ వస్తున్న మేకర్స్ టీజర్ పై కూడా అప్డేట్ ఇచ్చారు.

అయితే మొదటగా అనుకున్న సమయానికి రెడీ కావడంతో తర్వాత విడుదల చేస్తామని ప్రకటించారు. మరి అది ఎప్పుడో అన్నది ఈరోజు సాయంత్రం 4 గంటల 59 నిమిషాలకు రివీల్ చేస్తున్నట్టుగా అప్డేట్ ఇచ్చారు. దీనిని లెటర్ టు సందీప్ అన్నట్టుగా ప్రకటించి టీజర్ పై అప్డేట్ డేట్ ను రివీల్ చెయ్యనున్నారు. ఇక ఈ చిత్రానికి శశి కిరణ్ తక్క దర్శకత్వం వహించగా సోనీ పిక్చర్స్ మరియు మహేష్ నిర్మాణ సంస్థ సహా శరత్, చంద్రలు కలిసి సంయుక్తంగా నిర్మాణం వహిస్తుంన్నారు.

Exit mobile version