‘అనకాపల్లి’ చిత్రం నుంచి ‘ఎలగే పిల్ల’ లిరికల్ సాంగ్.. రిలీజ్ చేసిన నిర్మాత నాగవంశీ

‘అనకాపల్లి’ చిత్రం నుంచి ‘ఎలగే పిల్ల’ లిరికల్ సాంగ్.. రిలీజ్ చేసిన నిర్మాత నాగవంశీ

Published on Jul 15, 2026 8:00 AM IST

విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట జంటగా నటిస్తున్న ‘అనకాపల్లి’ సినిమా నుంచి ‘ఎలగే పిల్ల’ అనే రొమాంటిక్ లవ్ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తూ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటకు కపిల్ కపిలాన్, దేవ్ జండ్ గాత్రం అందించారు. లిరికల్ వీడియోలో హీరో విక్రమ్ సహిదేవ్ డాన్స్ స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి.

భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన ఉమ్మడిగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కాండ్రేగుల కుమార్ రాజా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ఒక ముఖ్య పాత్రలోనూ నటించారు. మాయా. వి కెమెరామెన్‌గా, దేవ్ జండ్ సంగీత దర్శకుడిగా, శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటర్‌గా ఈ చిత్రానికి బాధ్యతలు నిర్వర్తించారు.

తారక్ పొన్నప్ప, ఇంద్రజ అబ్సర్, మహబూబ్ బాషా, నందిని రాయ్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ రా అండ్ రస్టిక్ చిత్రాన్ని ఆగస్ట్ 7న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘అమ్మోరు దిగినాది’, ‘లబ్బరు బొమ్మ’ పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని చిత్ర యూనిట్ పేర్కొంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు