విజయ్ నాకు ఎప్పుడూ అదే చెబుతుంటాడు – ఆనంద్ దేవరకొండ

Published on Nov 8, 2021 7:05 am IST

నూతన దర్శకుడు దామోదర దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా గీత్ సైని హీరోయిన్‌ గా రాబోతున్న సినిమా ‘పుష్పక విమానం’. తాజాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అయితే హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘నేను హీరోగా ఇవాళ మీ ముందు ఉన్నానంటే కారణం అన్నయ్య, మా నాన్ననే. అన్నయ్య విజయ్ ఎంతో కష్టపడి స్టార్ అయ్యాడు. తను వేసిన దారిలో నేను హాయిగా నడుచుకుంటూ మీ ముందుకు వచ్చాను.

కానీ విజయ్ మాత్రం నాకు ఎప్పుడూ సొంతంగా ఎదగమనే చెబుతుంటాడు. ఆ మాట ప్రకారమే నేను ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుని చేసిన సినిమా ఇది. ముఖ్యంగా రెగ్యులర్ హీరో క్యారెక్టర్ లా ఈ సినిమాలో నా పాత్ర ఉండదు. సహజంగా మీ చుట్టూ కనిపించే ఒక పాత్ర చిట్టిలంక సుందర్ ది. పెళ్లి చేసుకుని హాయిగా ఉందామనుకుంటే అతని భార్య లేచిపోతుంది. ఎందుకు అనేది థియేటర్ లో చూడండి. ఫన్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ అన్ని అంశాలు పుష్పక విమానం చిత్రంలో ఉంటాయి. నవంబర్ 12న థియేటర్లలో కలుద్దాం’ అంటూ ఆనంద్ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :