ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’ ఫస్ట్ లుక్ రిలీజ్

Published on Sep 9, 2023 8:02 pm IST

ఇటీవల లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ బేబీ తో మంచి సక్సెస్ సొంతం చేసుకున్న యువ నటుడు ఆనంద్ దేవరకొండ తాజాగా నటిస్తున్న మూవీ గం గం గణేశా. కొత్త దర్శకుడు ఉదయ్ శెట్టి తెరకెక్కిస్తున్న మూవీ యొక్క ప్రమోషన్స్ ని తాజాగా మేకర్స్ స్టార్ట్ చేసారు. రెండు చేతుల్లో గన్స్ పట్టుకుని ఉన్న హీరో ఆనంద్ దేవరకొండ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసారు.

ఈ పోస్టర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీని హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న గం గం గణేశా మూవీకి సంబందించిన టీజర్, ట్రైలర్, రిలీజ్ డేట్ వంటి డీటెయిల్స్ అన్ని కూడా అతి త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :