ఆనంద్ హీరో రాజాకు అమ్రితతో వివాహం

Raja-Marrige-Photos-(9)
ఆనంద్, ఆ నలుగురు మరియు ఓ చినదానా వంటి సినిమాలలో నటించిన హీరో రాజా అమ్రితా విన్సెంట్ ను వివాహం చేసుకున్నారు. ఈ వివాహం చెన్నైలో వున్న నుంగంబాకం లో థెరెసా చర్చ్ లో జరిగింది. ఆ తరువాత సినిమా ప్రముఖులు, సన్నిహితులు మరియు బంధువుల నడుమ ఘనంగా పార్టీ ని జరుపుకున్నారు. ఈ వేడుకకు రోశయ్య కూడా హాజరయ్యారు

ఈరోజు ఈ వార్తను రాజా అధికారికంగా వివరించాడు. హైదరాబాద్ లో కూడా ఒక పెద్ద రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. రాజా త్వరలో సినిమాలపై తిరిగి ద్రుష్టిపెట్టనున్నారని సమాచారం. “నేను చెన్నై కోయంబత్తూర్ లో పుట్టాను. నాకు తమిళంకూడా వచ్చు. తమిళ సినిమాలపై కూడా దృష్టి పెట్టనున్నాను” అని చెప్పాడు

రాజా తన తదుపరి సినిమా విశేషాలు ఎప్పుడు తెలుపుతాడో అన్న విషయం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Exit mobile version