పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న ‘ఆనందో బ్రహ్మ’ !


మహి వి రాఘవ్ దర్శకత్వంలో తాప్సి ప్రధాన పాత్రలో రూపొందిన ‘ఆనందో బ్రహ్మ’ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఉదయం ప్రదర్శింపబవడిన మొదటి షోతోనే సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది. హర్రర్ కామెడీ జానర్లో దెయ్యాలు మనుషులకు భయపడటం అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం సరికొత్త తరహా ఎంటర్టైన్మెంట్ తో ను అందించడంతో చూసిన ప్రేక్షకులు సంతృప్తితో ప్రసంశలు కురిపిస్తున్నారు.

పైగా ఈ రోజు మరే సినిమాల విడుదల లేకపోవడంతో సోలో రిలీజ్ చిత్రానికి బాగా కలిసొచ్చింది. అంతేగాక గత వారం వచ్చిన చిత్రాలన్నీ కూడా ఎక్కువ శాతం రెగ్యులర్ ఫార్మాట్లోనే ఉండటంతో అలరించే హర్రర్ బేస్డ్ కామెడీ సినిమా వచ్చి చాలా కాలం కావోస్తుండటంతో ఆడియన్స్ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. విమర్శకులు సైతం మహి వి రాఘవ్ చేసిన ఈ భిన్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. బలమైన కంటెంట్ ఆధారంగా తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం భవిష్యత్తులో మంచి లాభాల్ని ఆర్జించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.