ఆ నటుడు లేకుండా కెజిఎఫ్ 2 ని ఉహించుకోగలమా..!

Published on Feb 29, 2020 7:07 am IST

2018లో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన కెజిఎఫ్ బాక్సాఫీస్ వద్ద ఓ ప్రభంజనంలా పేలింది. హీరో యష్ ఇమేజ్ మార్చివేసిన ఈ చిత్రంలో ప్రతి పాత్ర ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. అలాంటి పాత్రలలో నటుడు అనంత్ నాగ్ పోషించిన సీనియర్ జర్నలిస్ట్ రోల్ చాలా ప్రత్యేకం. రాఖి మాఫియా సామ్రాజ్యం గురించి అతని పాత్రను పతాక స్థాయిలో ఎలివేట్ చేసే పాత్రలో ఆయన నటన ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక ఆయన పాత్రకు తగ్గట్టుగా నటుడు శుభలేఖ సుధాకర్ గంభీరమైన డబ్బింగ్ వాయిస్ తెలుగులో ఆకర్షణగా నిలిచింది.

కాగా కెజిఎఫ్ కి కొనసాగింపుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రంలో అనంత్ నాగ్ నటించడం లేదట. పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే నటించే ఆయనకు దర్శకుడికి మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చాయట. దీనితో ఈ సినిమా నుండి ఆయన తప్పుకున్నారట. కెజిఎఫ్ లో ఆయన నటించకపోవటం ఆ చిత్రానికి పెద్ద దెబ్బే అనుకోవాలి. ఆయన లేకుండా కెజిఎఫ్ ని ఊహించుకోవడం కష్టమే. ఇటీవల అనంత్ నాగ్ నితిన్ హిట్ మూవీ భీష్మలో కీలక రోల్ చేశారు.

సంబంధిత సమాచారం :