నేరుగా ఓటీటీలోకి వచ్చిన ‘అనంత’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

Anantha

దర్శకుడు సురేష్ కృష్ణ చాలా రోజుల తర్వాత తెరకెక్కించిన చిత్రం ‘అనంత’. జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని డివోషనల్ డ్రామాగా దర్శకుడు సురేష్ కృష్ణ రూపొందించారు. ఇక ఈ సినిమా ఇప్పుడు నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో ‘అనంత’ చిత్రం నేటి(జనవరి 13) నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ సినిమాలో సుహాసిని మణిరత్నం, వై.జి. మహేంద్రన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. థియేటర్లలో కాకుండా, ఈ చిత్రాన్ని నేరుగా జియో హాట్‌స్టార్ ఓటీటీలో విడుదల చేశారు.

దేవా అందించిన సంగీతం సినిమాకు మంచి అసెట్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

Exit mobile version