రంగస్థలంలో రంగమ్మ గా అలరించబోతోన్న అనసూయ
Published on Feb 19, 2018 8:04 pm IST

లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ చరణ్ తో చేస్తోన్న రంగస్థలం సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. సమంత, చరణ్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు సినిమాలో ప్రధాన బలం కానున్నట్లు సమాచారం. లవ్ స్టొరీ ఈ సినిమాలో ప్రధానంగా సాగుతుందని తెలుస్తోంది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా మొదటిపాటకు మంచి రెస్పాన్స్ లభించింది. త్వరలో ఈ సినిమాలోని రంగమ్మ మంగమ్మ పాటను విడుదల చేయబోతున్నారు. రంగమ్మ పాత్రలో అనసూయ నటించింది. ఫోక్ సాంగ్ గా చిత్రీకరించిన ఈ పాట ఆడియాన్స్ ను అలటించబోతొందట.

 
Like us on Facebook