పాత సంప్రదాయాలు పాటించక్కర్లేదు – అనసూయ కొత్త స్టేట్మెంట్ వైరల్

పాత సంప్రదాయాలు పాటించక్కర్లేదు – అనసూయ కొత్త స్టేట్మెంట్ వైరల్

Published on Dec 25, 2025 8:00 PM IST

Anasuya Bharadwaj 4

ఇటీవల ప్రముఖ నటుడు శివాజీ చేసిన పలు అనుచిత కామెంట్స్ విషయంలో సినీ పరిశ్రమకి చెందిన కొందరు మహిళా నటులు అలాగే సింగర్స్ తమ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై శివాజీ కూడా తాను ఇచ్చిన స్పీచ్ లో కేవలం పలికిన అభ్యంతర పదాలు మాత్రమే తప్పు అని వాటిని వెనక్కి తీసుకుంటున్నాను అని క్షమాపణ కూడా కోరారు.

అయితే ఈ అంశంలో రచ్చ ఇంకా ముగియలేదు. దీనిపై నటి అలాగే యాంకర్ అనసూయ భరద్వాజ్ నుంచి మరిన్ని స్టేట్మెంట్ లు బయటకి వస్తున్నాయి. శివాజీ నిన్న ప్రెస్ మీట్ లో తన వెర్షన్ చెప్పేసి ఊరుకున్నారు కానీ అక్కడ నుంచి సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ నుంచి వరుస పోస్ట్ లు వస్తున్నాయి.

ముఖ్యంగా ఆడవారు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనేది నా దేహం నా దుస్తులు అనే మాటతో తాను తన వెర్షన్ ని వినిపిస్తూ వస్తున్నారు. ఇలా తాజాగా ఎప్పుడు నుంచో పాటిస్తూ వస్తున్నా పాత ఆలోచనలు సంప్రదాయాలు లాంటివి ఇప్పుడు ఆడవారు పాటించక్కర్లేదు అని ఆమె పిలుపునిచ్చారు.

“పాత తరాలు నేర్చుకున్నవి లేదా అలవాటుపడ్డ ఆలోచనలు మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అని అలాగే మనం మార్పును, స్వేచ్ఛను ఎంచుకుంటూ గౌరవాన్ని కాపాడుకోవాలని ఆమె సూచించారు. అయితే దీనిపై కూడా పలు కామెంట్స్ పడుతున్నాయి. ఇక ఇదంతా ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు