మెగస్టార్ మూవీలో అనసూయకు బంఫర్ ఆఫర్?

Published on Aug 25, 2021 2:00 am IST

బుల్లి తెరపైనే కాకుండా వెండి తెరపై కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న అనసూయ అందుకు తగ్గట్టుగానే విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తుంది. ఈ క్రమంలోనే ఆమెకు మెగా హీరోల సినిమాల నుంచి వరుస ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాంచరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి మెప్పించిన అనసూయ ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా అనసూయకు ఛాన్స్ దక్కినట్టు టాక్ వినిపిస్తుంది.

మెగస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్‌లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్‌ను మొన్ననే ఫిక్స్ చేశ్సారు. ఈ కమర్షియల్ పొలిటికల్ సినిమాలో అనసూయ ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుందని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఇటీవలే చిత్ర యూనిట్ అనసూయ నుంచి కాల్షీట్లు కూడా తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :