విజయ్ దేవరకొండ నిర్మించనున్న చిత్రంలో ప్రముఖ యాంకర్ ?

విజయ్ దేవరకొండ నిర్మించనున్న చిత్రంలో ప్రముఖ యాంకర్ ?

Published on Jan 20, 2019 3:05 PM IST


యాంకర్ గా కెరీర్ ప్రారంభించి బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన అనసూయ భరద్వాజ్ ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వరసగా ఆఫర్లను అందుకుంటుంది. క్షణం , రంగస్థలం చిత్రాల తరువాత ఇటీవల ఎఫ్ 2 లో స్పెషల్ సాంగ్ లో కనిపించింది అనసూయ. ఇక ఇప్పుడు ఈ యాంకర్ కు మరొక బంపర్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాత గా మారి తనకు ‘పెళ్లి చూపులు’ లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ చిత్రంలో తరుణ్ కు జోడిగా అనసూయ నటించనుందని సమాచారం. అయితే తర్వలోనే ఈ వార్తలపై క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు