నెటిజన్‌కు అనసూయ కౌంటర్‌

నెటిజన్‌కు అనసూయ కౌంటర్‌

Published on Jun 23, 2024 8:12 PM IST


‘జబర్థస్త్’ యాంకర్‌ గా ప్రేక్షకులను అలరించి ఫుల్ క్రేజ్ ను సంపాదించింది ‘అనసూయ’. తాజాగా తన గురించి ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టిన ఓ నెటిజన్‌కు తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. అసలు ఆ నెటిజన్ ఏం పోస్ట్ పెట్టాడంటే.. అనసూయ పాల్గొన్న ఓ టీవీ కార్యక్రమానికి సంబంధించిన క్లిప్పింగ్‌ను షేర్‌ చేస్తూ.. ‘‘ఏంటీ నాన్సెన్స్‌ అనసూయ..? ఏదైనా అంటే విక్టిమ్‌ కార్డ్‌ప్లే చేస్తారు’ అని పోస్ట్ పెడుతూ వాంతి చేసుకున్నట్టు కనిపించే ఎమోజీలను కూడా ఆ పోస్ట్ కి యాడ్ చేశాడు.

దీంతో ఈ పోస్ట్ పై అనసూయ వ్యంగ్యాస్త్రాలు విసురుతూ.. ‘మీరిలా తీవ్ర అనారోగ్యంగా ఉండటానికి కారణమేంటో తెలుసుకోవచ్చా? ఎమోజీ, మీ మైండ్‌ విషయంలో..’ అని రిప్లై ఇచ్చింది. మొత్తానికి అనసూయ బుల్లితెర నుంచి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఫుల్ డిమాండ్ తో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు