ఫ్యాన్స్ తో ‘అనసూయ’ ముచ్చట్లు !

ఫ్యాన్స్ తో ‘అనసూయ’ ముచ్చట్లు !

Published on Apr 22, 2020 4:17 PM IST

Anasuya Bharadwaj

‘యాంకర్ అనసూయ’ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ తో ఫేమస్ అయి.. ఆ తరువాత బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి ‘రంగస్థలం’ ‘యాత్ర’ సినిమాలతో నటిగా మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. రోజురోజుకు ఆ క్రేజ్ ని రెట్టింపు చేసుకుంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.

కాగా ఈ లాక్ డౌన్ లో అనసూయ అభిమానుల కోరిక మేరకు వారితో ‘అస్క్ అనసూయ’ అంటూ ట్విట్టర్లో సరదాగా ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అందులో ఒకటి ‘మీ మొదటి జీతంతో ఏమి చేశారు ?’ అని ఓ అభిమాని అడగగా.. ‘మా అమ్మకి ఒక బంగారపు ఉంగరాన్ని కొన్నాను’ అని అనసూయ సమాధానం ఇచ్చింది. అలాగే ‘జిమ్ లో మీరు రోజూ ఎంత సమయం గడుపుతారు’ అని మరో అభిమాని అడగగా .. అనసూయ సరదాగా ‘అసలు గడపను’ అంటూ సమాధానం ఇచ్చింది.

అలాగే మరో అభిమాని ‘మీరు నటించిన సినిమాల్లో మీరు ఛాలెంజ్ అనుకుని చేసిన రోల్ ఏది?’ అని అడగగా.. ‘ఇప్పటివరకూ నేను ఛాలెంజ్ రోల్ ఏది చేయలేదు, నాకు అలాంటి రోల్ కూడా రాలేదు’ అని అనసూయ తెలిపింది. ‘మీ జీవితాన్ని ఒకే మాటలో వివరించమంటే ?’.. ‘నా కోసం ఉన్న క్షణంలో నాకు నచినట్లుయిగా ఉత్తమంగా జీవించడం’ అంటూ ఆసక్తికరమైన సమాధానం చెప్పింది.

ఇక అనసూయ తన తదుపరి సినిమాల గురించి కూడా మాట్లాడుతూ… ‘తానూ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నానని.. కానీ లాక్ డౌన్ కారణంగా షెడ్యూల్స్ అన్ని గజిబిజిగా మారిపోయాయి అని.. అయినప్పటికీ తన చిత్తశుద్ధి పై రాజీ పడదని అనసూయ చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు