లేటెస్ట్ గా “క్రాక్” సాలిడ్ హిట్ తో అదిరిపోయే కం బ్యాక్ అందుకున్న మాస్ మహారాజ్ రవితేజ అంతే ఎనర్జీతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అలా ఇప్పుడు దర్శకుడు రమేష్ వర్మతో ఒక “ఖిలాడి” అనే ఇంటెలిజెంట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే ఈ భారీ చిత్రం వచ్చే మే లోనే విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించేసారు. అయితే ఈ చిత్రంలో ఇప్పుడు గ్లామరస్ యాంకర్ అనసూయ కూడా ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. అంతే కాకుండా దర్శకుడు ఈ చిత్రంలో అనసూయాది ఒక కీలక రోల్ అన్నట్టే హింట్ ఇస్తున్నారు.
ఆమె ఈ చిత్రంలో ఒక గేమ్ చేంజర్ లా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా ఈ చిత్రంలో ఆమెకు సరైన రోల్ నే పడినట్టు చెప్పాలి. మరి ఈ సినిమాను అనసూయ రోల్ ఎలా తిప్పుతుందో తెలియాలి అంటే మే 28 వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
I am super kicked to be a part of this crrrraaazyyy film!!! One helluva cast and crew!!! Watch out for us!! #Khiladi https://t.co/It9swsOcHd
— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 3, 2021


