బుల్లితెరపై స్టార్ యాంకర్స్ లో ఒకరుగా చెలామణీ అవుతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాంకర్ అనసూయ. తన బ్యూటిఫుల్ లుక్స్ మరియు ఎనర్జీ లెవల్స్ తో అనసూయకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వచ్చింది. చాలా కాలం నుంచి అనసూయకి సినిమాలలో ఆఫర్స్ వచ్చినా నో చెప్పిన ఈ భామ ఇటీవలే ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇదివరకే తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం అనసూయ మొదటగా ఓ థ్రిల్లర్ సినిమాలో కనిపించనుంది.
రవికాంత్ పెరేపు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో అడవి శేష్ హీరోగా నటించనున్నాడు. అడవి శేష్ కి జోడీగానే అనసూయ కనిపించనుంది. ప్రస్తుతం అనసూయ ఈ థ్రిల్లర్ సినిమాలో తన పాత్ర కోసం స్పెషల్ వర్క్ షాప్ చేస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2015 మర్చి నుంచి మొదలు కానుంది. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.


