‘బిగ్ బాస్ 3’లో ప్రముఖ యాంకర్

Published on Jun 22, 2019 10:00 pm IST

ఇంకా కొద్దిరోజులలో బుల్లితెర ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో “బిగ్ బాస్ 3” మొదలు కానుంది. దీనికి సంబంధించిన అన్ని సన్నాహక కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసిన స్టార్ మా త్వరలోనే గ్రాండ్ గా షో ని మొదలుపెట్టబోతోంది. లాస్ట్ టైం “ఏదైనా జరగొచ్చు” అనే ఆసక్తికరమైన టాగ్ లైన్ తో నాని హోస్ట్ గా షో రక్తికట్టించిన నిర్వాహకులు,ఈ సారి ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా వైవిధ్యంగా కొత్త కాన్సెప్ట్ లతో షోని సిద్ధం చేస్తున్నారట.

తాజాగా బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ గురించి ఓ ఆసక్తికర విషయం బైటకి వచ్చింది. అదేంటంటే ప్రముఖ యాంకర్ లాస్య ఈ షోలో పాల్గొనే లక్కీ ఛాన్స్ దక్కించుకొందట. పెళ్లి తర్వాత ఆమె యాంకర్ గా అంత యాక్టీవ్ గా లేరనేచెప్పాలి. ఐతే షో నిబంధనల ప్రకారం బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించే వరకు కంటెస్టెంట్స్ లిస్ట్ బహిర్గతం కాకూడదు,అందుకే దీనిపై ఎటువంటి స్పష్టత లేదు. బిగ్ బాస్ 3 హోస్ట్ గా కింగ్ నాగార్జున దాదాపుగా ఖరారైనట్లు సమాచారం.

సంబంధిత సమాచారం :

More