
ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట అయితే చాలు… తెలుగింట్లో మహిళలలు అందరూ టీవీలకు అతుక్కుపోతారు. ఈ టీవీలో సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘స్టార్ మహిళ’ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. తెలుగింటి ఆడపడుచుల ఆదరణను సొంతం చేసుకున్న ఈ కార్యక్రమం ఇప్పటికే పలు రికార్డులు సృష్టించింది. తాజాగా లిమ్కా బుక్ రికార్డులకు ఎక్కింది.
ఆగష్టు 9, 2008లో ప్రారంభమైన ‘స్టార్ మహిళ’ కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇప్పటివరకు 1815 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఒక మహిళ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గేమ్ షో ఇన్ని ఎపిసోడ్స్ పూర్తి చేసుకోవడం ఇదే ప్రధమం. ఒక్క ఆదివారం మినహ ప్రతి రోజు ఒంటి గంటకు ఈటీవీలో ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది.
మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అత్యంత బుల్లితెర వీక్షకాదరణ కల ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులకు అందిస్తుంది. సమర్దవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది.

