‘అందాల రాక్షసి’ సినిమా ద్వారా హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి. వీరిద్దరి జంట చూడ ముచ్చటగా ఉందంటూ ప్రేక్షకుల నుండి ప్రసంశలు వచ్చాయి. తాజాగా నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి మరోసారి జోడి కట్టారు.
నూతన దర్శకుడు జగదీశ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో వీరిద్దరూ జంటగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యింది. హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
నవీన్ చంద్ర, నవదీప్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ ‘భం బోలేనాథ్’ నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. లావణ్య త్రిపాఠి ఈ సినిమాతో పాటు నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలో నటిస్తుంది.


