చైనా బాక్సాఫీస్ ను చేస్తున్న బాలీవుడ్ మూవీ !

Published on Apr 15, 2019 2:45 pm IST

గత ఏడాది బాలీవుడ్ లో విడుదలై బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ అంధదున్. శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా , టబు , రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

ఇక ఈ చిత్రం ‘ పియానో ప్లేయర్’ అనే టైటిల్ తో ఇటీవల చైనా లో విడుదలైయింది. అక్కడ ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో 200కోట్ల వసూళ్లను రాబట్టి చైనా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. దాంతో ఈ చిత్రం అక్కడ అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన 4వ ఇండియన్ మూవీ గా రికార్డు సృష్టించింది.

చైనా లో అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 5 ఇండియన్ మూవీస్ :

దంగల్

సీక్రెట్ సూపర్ స్టార్

భజరంగి భాయిజాన్

అంధదున్

హిందీ మీడియం

సంబంధిత సమాచారం :

X
More