చైనాలో 300 కోట్లు రాబట్టిన బాలీవుడ్ చిత్రం !

Published on Apr 23, 2019 3:00 pm IST

చైనాలో బాలీవుడ్ సినిమాలకు ఆదరణ పెరుగుతుంది. ఇక్కడ బ్లాక్ బ్లాస్టర్ విజయాలను సాధించిన చిత్రాలు అక్కడ కూడా అదే రేంజ్ లో వసూళ్లను రాబడుతున్నాయి. అమీర్ ఖాన్ నటించిన దంగల్ 1000 కోట్లకు ఫైగా వసూళ్లను రాబట్టి చైనా బాక్సాఫీస్ వద్ద హైయెస్ట్ గ్రాసర్ ఇండియన్ మూవీ గా టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. దీనితరువాత సీక్రెట్ సూపర్ స్టార్ రెండవ స్థానంలో కొనసాగుతుండగా ఇటీవల విడుదలైన అందదున్ మూడో స్థానంలో నిలిచింది.

ఈ చిత్రం ‘ పియానో ప్లేయర్’ అనే టైటిల్ తో ఇటీవల విడుదలై హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది. కేవలం మూడు వారాల్లోనే 300కోట్ల వసూళ్లను రాబట్టి భజరంగి బాయ్ జాన్ కలెక్షన్స్ ను క్రాస్ చేసింది.

కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా , టబు , రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో నటించారు. ఇండియాలో ఈచిత్రం 75కోట్లను రాబట్టగా ఇప్పుడు చైనాలో ఏకంగా 300కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టడం విశేషం.

సంబంధిత సమాచారం :