‘ఆంధ్రాపోరి’ రిలీజ్ డేట్ ఖరారు..!

‘ఆంధ్రాపోరి’ రిలీజ్ డేట్ ఖరారు..!

Published on May 28, 2015 10:00 AM IST

andhra-pori
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు పూరీ ఆకాష్ ‘చిరుత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో బాలనటుడిగా మంచి ప్రతిభ కనబరిచాడు. ‘ధోని’ సినిమా ద్వారా ప్రధాన పాత్రలోనూ మెప్పించిన ఆకాష్, తాజాగా ‘ఆంధ్రాపోరి’ అనే టీనేజ్ లవ్‌‍స్టోరీ ద్వారా పూర్తి స్థాయి హీరోగా పరిచయం కానున్నాడు. ప్రతిష్టాత్మక ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించబడ్డ ఈ సినిమాకు ‘ఋషి’ సినిమా ఫేం రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించారు. ఉల్కా గుప్తా హీరోయిన్‌గా నటించారు.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటివరకూ సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూసిన సినిమా యూనిట్ జూన్ 5వ తేదీని రిలీజ్ డేట్‌గా ఫిక్స్ చేశారు. మరాఠీలో అప్పటివరకూ ఉన్న రికార్డులను తుడిచిపెట్టిన ‘టైమ్‌పాస్’ సినిమాకు రీమేకే ఈ ‘ఆంధ్రాపోరి’. తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఇప్పటికే వినూత్నంగా ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. మరి మరాఠీలో మ్యాజిక్ క్రియేట్ చేసిన ఈ లవ్‌స్టోరీ తెలుగులోనూ ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందా అన్నది తెలియాలంటే జూన్ 56 వరకూ ఆగాల్సిందే!

తాజా వార్తలు