ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ గాంధీ జయంతి సందర్భంగా క్లీన్ ఇండియా కోసం ప్రారంభించిన కార్యక్రమం ‘స్వచ్చ భారత్ అభియాన్’. ఇప్పటికే ఇండియాలోని పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని చాలెంజ్ విసిరారు. తాజాగా వీరి లిస్టులో రిలయన్స్ అధినేత అనీల్ అంబాని కూడా చేరారు.
అనీల్ అంబాని స్వచ్చ భారత్ అభియాన్ లో పాల్గొని ముంబై రైల్వే స్టేషన్ చుట్టూ పక్కల ఉన్న ప్రాంతాన్ని క్లీన్ చేసాడు. అంతే కాకుండా అయన కొంతమంది ప్రముఖులకి ఈ చాలెంజ్ చేసారు. అందులో టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున కూడా ఉన్నారు. మరి ఈ చాలెంజ్ ని తీసుకొని నాగార్జున స్వచ్చ భారత్ కాంపైన్ లో పాల్గొని ఎవరెవరి తను చాలెంజ్ విసురుతాడనేది చూడాలి.
ప్రస్తుతం నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సీజన్ 2 కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇది కాకుండా నూతన దర్శకుడితో ఓ సినిమా చెయ్యడానికి సిద్దమవుతున్నాడు.


