‘హలో గురు’ కోసం యువ దర్శకుడి సలహాలు !

‘హలో గురు’ కోసం యువ దర్శకుడి సలహాలు !

Published on Oct 15, 2018 3:26 PM IST

యువ హీరో రామ్ నటించిన తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’ విడుదలకు సిద్ధంగా వుంది. త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈచిత్రాన్ని కొద్దీ రోజుల క్రితంయువ దర్శకుడు అనిల్ రావిపూడి వీక్షించి సెకండ్ హాఫ్ లో కొద్దీ పాటి మార్పులను చెప్పాడట. మేకర్స్ కూడా ఆ సలహాలను స్వీకరించి అనిల్ చెప్పిన సన్నివేశాలను సినిమాలో యాడ్ చేశారట. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈచిత్రం అక్టోబర్ 18న విడుదలకానుంది. ఈచిత్రం ఫై నిర్మాత దిల్ రాజు ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.

ఇక అనిల్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ‘ఎఫ్ 2’ అనే మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు