రావిపూడి ఎఫెక్ట్.. త్రివిక్రమ్ పై ఇంత నెగిటివిటీ తగునా?

రావిపూడి ఎఫెక్ట్.. త్రివిక్రమ్ పై ఇంత నెగిటివిటీ తగునా?

Published on Jul 29, 2026 10:02 PM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ దర్శకుల్లో ఎప్పుడు నుంచో ఇండస్ట్రీలో ఉండి తనదైన సినిమాలతో ఆకట్టుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. తన పదునైన మాటలు, ఎమోషనల్ సన్నివేశాలు, ప్రాసలు, పంచ్ లతో రెండు దశాబ్దాలకి పైగా టాప్ దర్శకుల్లో ఒకరిగా తాను కొనసాగుతూ వచ్చారు.

అయితే అల్టిమేట్ గా త్రివిక్రమ్ సినిమాలు అన్నీ కుటుంబ కథా చిత్రాలుగానే కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఉన్న ట్రెండ్ లో దర్శకుడు అనీల్ రావిపూడి కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లని తీసుకొస్తూ వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ నుంచి ‘గుంటూరు కారం’ తర్వాత ‘ఆదర్శ కుటుంబం’ అనే మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతుంది.

అయితే ఈ సినిమా తాలూకా ప్రోమోలు చూసిన తర్వాత ఓ వర్గం ఆడియెన్స్ మాత్రం త్రివిక్రమ్ కి అనీల్ రావిపూడి సినిమాలుకి లింక్ పెట్టి సోషల్ మీడియాలో నెగిటివ్ చేసుకుంటున్నారు. ఎంత వెంకీ మామతో ఫ్యామిలీ డ్రామా తీస్తే మాత్రం వారంతా ఇంకా అనీల్ రావిపూడి హ్యాంగోవర్ లోనే ఉండి ఈ సినిమా ట్రైలర్ లాంటివి కూడా చూడకుండా కేవలం చిన్న క్లిప్స్ తో అప్పుడే ఒక అంచనాకు వచ్చేయడం అనేది ఎంతవరకు సబబు?

పోనీ వీళ్ళకి అనీల్ రావిపూడి సినిమాలు అయినా నచ్చుతాయా అంటే వాటినీ క్రింజ్ అనే అంటారు. ఇప్పుడు దానినే త్రివిక్రమ్ సినిమాకి కూడా ఆపాదించేస్తున్నారు. సో సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలి అంటే ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఆ బ్యాచ్ అంతా అప్పటివరకు ఆగితే మంచిది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు