“ఎఫ్3″ని గట్టిగానే ప్లాన్ చేస్తున్న అనీల్ రావిపూడి.!

“ఎఫ్3″ని గట్టిగానే ప్లాన్ చేస్తున్న అనీల్ రావిపూడి.!

Published on Mar 26, 2021 9:00 PM IST

F3
తనదైన ఎంటర్టైనింగ్ సినిమాలతో దర్శకుడు అనీల్ రావిపూడి తెలుగు సినిమాలో మంచి మార్క్ ను సెట్ చేసుకున్నాడు. అలాగే తన డిఫరెంట్ కామెడీ ఫార్ములాతోనే ఇప్పటి వరకు భారీ హిట్స్ ను సొంతం చేసుకున్నాడు. అయితే తాను తీసిన చిత్రాల్లో విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లతో చేసిన మల్టీస్టారర్ చిత్రం “ఎఫ్ 2” ఎంత పెద్ద విజయం అందుకుందో అందరికీ తెలిసిందే.

మరి అలాగే తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఆల్రెడీ ఆన్ కార్డ్స్ లో ఉంది. అయితే దీనిని మాత్రం మొదటి దానికి భిన్నమైన కథ ఉంటుంది కానీ ఫన్ మాత్రం ఎక్కడా తగ్గదని దర్శకుడు చెప్పాడు. మరి ఇదిలా ఉండగా మరో హంగును జత చేస్తున్నట్టుగా ఇప్పుడు టాక్ నడుస్తుంది.

ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు గాను బాలీవుడ్ హీరోయిన్ ను అనీల్ దింపుతున్నాడట. అది కూడా యంగ్ బ్యూటీ సోనాల్ చౌహన్ అని తెలుస్తుంది. మరి ఉన్నట్టుండి బాలీవుడ్ నుంచి సెలక్షన్ జరిగింది అంటే అనీల్ మొదటి చిత్రం కంటే ఎక్కువే ప్లాన్ చేస్తున్నాడని చెప్పాలి. మరి ఈ చిత్రం ఎలా ఉండనుందో తెలియాలి అంటే వచ్చే ఆగష్టు 27 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు