మహేశ్ బాబు ఋణం తీర్చుకుంటాను !

Published on May 31, 2019 11:00 pm IST

మహేశ్ బాబు 26వ సినిమాగా అనిల్ రావిపూడితో చేస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో అధికారికంగా పూజ కార్యక్రమంతో ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. నాకీ అవకాశం ఇచ్చిన మహేష్ బాబు గారికి కృతజ్ఞతలు.. ఒక మంచి హిట్ ఫిలిం ఇచ్చి అయన ఋణం తీర్చుకుంటాను. ముగ్గురి నిర్మాతలతో పనిచేస్తున్నాను.. చాల సంతోషంగా ఉంది.. చాల రోజుల తర్వాత విజయశాంతి గారు ఈ సినిమాలో నటించబోతున్నారు అని తెలిపారు.

అనిల్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ సినిమాని ఒప్పుకున్నందుకు విజయశాంతిగారికి చాల థాంక్స్.. జగపతి బాబు గారు మంచి రోల్ చేస్తున్నారు.. రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.. దేవి శ్రీ గారితో మరోసారి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది.. ఈ సినిమా 2020 సంక్రాంతి కి రిలీజ్ అవుతుంది’ అని తెలియజేసారు.

ఇక ఇటీవలే ‘ఎఫ్ 2’తో భారీ హిట్ ను కొట్టాడు అనిల్. మరి మహేశ్ తో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :

More