మహేష్ సపోర్ట్ కోరనున్న అనిల్

Published on Feb 21, 2020 3:00 am IST

అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేసిన చిత్రం ‘ఎఫ్ 2’. గతేడాది సంక్రాంతికి విడుదలైన చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది. ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ‘ఎఫ్ 3’ రూపొందిస్తామని అప్పుడే అనౌన్స్ చేశారు అనిల్. ఇందులో కూడా వెంకీ, వరుణ్ తేజ్ నటించనున్నారు. అయితే ఈ సినిమాను మరింత భారీగా మార్చడానికి రావిపూడి మహేష్ బాబు సాయం కొరనున్నారట.

అనిల్, మహేష్ బాబుల కలయికలో ఇటీవల వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మహేష్, అనిల్ రావిపూడిల మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దీంతో ‘ఎఫ్ 3’లో ఒక రోల్ చేయమని మహేష్ బాబును అడగాలనుకుంటున్నారట అనిల్. ఫిల్మ్ నగర్ టాక్ మేరకు కథలో మహేష్ రోల్ 20 నిముషాలకు పైగానే ఉంటుందట. ఒకవేళ అనిల్ మహేష్ వద్దకు ఈ రిక్వెస్ట్ తీసుకెళ్లి ఒప్పించగలిగితే ఆయన అనుకున్నట్టు సినిమాకు భారీతనం రావడం ఖాయం.

సంబంధిత సమాచారం :

More