టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో సూపర్ హిట్స్ కొట్టేసి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు, ప్రస్తుతం వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ లతో కలిసి ‘ఎఫ్ 3’ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉందని ప్రీక్లైమాక్స్ లో వచ్చే ఆ పాత్ర పూర్తీ కన్ ఫ్యూజన్ తో సాగుతూ ఫుల్ గా నవ్విస్తోందని.. ఇద్దరి హీరోలను ఫుల్ గా ఇరకాటంలో పెట్టే ఆ పాత్రలో కళ్యాణ్ రామ్ నటించబోతున్నాడని తెలుస్తోంది.
కాగా రీసెంట్ గా ఎఫ్ 3 కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే, డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టు కెళుతున్న వెంకటేష్, వరుణ్ లుక్ ఆసక్తి రేపగా… ఇది డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని తెలియజేశారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. రాజేంద్రప్రసాద్ తో పాటు వెన్నెల కిషోర్, సునీల్ క్యారెక్టర్స్ కూడా ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంటాయట. అలాగే వరుణ్, వెంకీల పాత్రలు కూడా ఫుల్ గా నవ్విస్తాయట.


