ప్రముఖ నిర్మాత చేతికి సిల్లీ ఫెలోస్ !

Published on Aug 27, 2018 3:18 pm IST

అల్లరి నరేష్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సిల్లీ ఫెలోస్. భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ నిన్న విడుదలైయింది. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చిన ఈ ట్రై లర్ చిత్రానికి మంచి బిజినెస్ ను తీసుకొస్తుంది. తాజాగా ఈ సినిమా నైజాం ఏరియా హక్కుల తోపాటు నెల్లూరు, ఈస్ట్, వెస్ట్ హక్కులను ప్రముఖ నిర్మాత ఏ కె ఎంటెర్టైనెంట్స్ అధినేత అనిల్ సుంకర ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నారట.

ఈ బిజినెస్ తో ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి సగానికి పైగా తిరిగొచ్చేసిందట. ఇంకా సీడెడ్ తో పాటు మిగితా ఏరియా హక్కులు అలాగే డిజిటల్ హక్కుల రూపంలో వచ్చేది కలుపుకంటే ఈచిత్రం రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్స్ ను చూడనుంది. ఇక చాలా కాలం తరువాత సునీల్ నరేష్ కలయికలో వస్తున్న ఈ చిత్రం ఫై మంచి అంచనాలే వున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈచిత్రం సెప్టెంబర్ 7న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More